Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు సమ్మయ్య
నవతెలంగాణ-మల్హర్రావు
పోడుభూముల సాధనకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్, గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏలు ఏర్పాటు చేయాలని, గిరిజనబంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 3న హన్మకొండలోని హరిత హౌటల్లో నిర్వహించే అవగాహనా సదస్సును విజయవంతం చేయాలని భూపాలపల్లి లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అజ్మీరా సమ్మయ్య నాయక్ కోరారు. సోమవారం మండలంలోని కొయ్యుర్ గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు రాజేష్నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావాత్ వాసు నాయక్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అజ్మీరా పూల్ సింగ్నాయక్తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. లేదంటే ఉద్యమాలు,పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు నవీన్ నాయక్, బోడ సతీష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.