Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మెన్ రాంబాబు
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మెన్ ముస్కు రాంబాబు అన్నారు. సోమవారం మండలంలోని ఈరవెన్ను రైతు వేదికలో ఈరవెన్ను సర్పంచ్ ముస్కు నిర్మల చంద్రబాబు అధ్యక్షతన ఈరవెన్ను క్లస్టర్ పరిధి కోతలబాద్, ఈరవెన్ను, లక్ష్మీనారాయణపురం, శాతపురం, దుబ్బ తండ(ఎస్పీ) గ్రామాల రైతుల అవగాహనా సదస్సు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి ఏ మురళీమోహన్‌తో కలిసి రాంబాబు పాల్గొని మాట్లాడారు. రైతులు దొడ్డు రకం వరి ధాన్యానికి బదులు సన్నరకం ధాన్యం సాగుపై దృష్టి పెట్టాలన్నారు. సన్నరకం ధాన్యం లో ఆర్ ఎన్ ఆర్ 15048, డబ్ల్యూ జి ఎల్ 968, కే ఎన్ ఎం 1368 రకాలను సాగు చేసుకోవాలని సూచించారు. ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలు కుసుమలు, ఆముదం, పొద్దుతిరుగుడు, పెసర్లు, కందులు, నువ్వులు, మొక్కజొన్న ,వేరుశనగ తదితరవి సాగు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్లు ఏనుగు అంజిరెడ్డి, గోనె వెంకటయ్య, ఎంపీటీసీ యాదగిరి, రైతుబంధు సమితి మండల డైరెక్టర్ గుగులోత్ యాదలక్ష్మి, తొర్రూర్ సొసైటీ డైరెక్టర్లు పులి ప్రభాకర్, ముస్కు కేశవరాం, ఏఈఓ పెద్దూరి శ్రావణి పాల్గొన్నారు