Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అదనపు కలెక్టర్ దివాకర
నవతెలంగాణ-భూపాలపల్లి
తన జీవితం తెలంగాణ ప్రజల కోసం ధారపోసిన బహుముఖ ప్రజ్ఞాశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్. దివాకర్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతిని పురస్క రించుకొని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం బీసీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శైలజ, ఇతర అధికారులతో కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిన్ననాటినుండే స్వాతంత్ర ఉద్యమం, రైతాంగ పోరాటం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జీవితాంతం దేశ సేవకే అంకితమయ్యారని అన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్ర సాధనకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. 96 ఏండ్లలోను రాష్ట్ర సాధనకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేసిన గొప్ప తెలంగాణ వాది అని కొనియాడారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శైలజ, ఎస్సీ అభివృద్ధి అధికారి సునిత, డీపీఆర్ఓ రవికుమార్, ఇన్చార్జి డీఈఓ మనోహర్‌నాయక్, ఈడీఎం శ్రీకాంత్, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ గౌస్, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ అధికారి క్రాంతి కిరణ్, బీసీ అభివద్ధిశాఖ ఏవో మొగిలి, సిబ్బంది పాల్గొన్నారు.
మల్హర్రావు : మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్ ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఎం రవీందర్, అధ్యాపకులు నరేందర్ ప్రవీణ్ కరుణాకర్, స్వరూపరాణి, రవి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు.