Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరుప్పుల
భారత్ బంద్ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో ఆఖిల పక్షం నాయకులు ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కాన్వారును వారు అడ్డుకున్నారు. దీంతో స్థానిక పోలీసులకు రాజకీయ పార్టీల నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. సుమారు 40నిమిషాల పాటు ఎమ్మెల్యే వాహనాలను నిలిపివేశారు. అనంతరం ఎస్సై రాజు నాయకులను అరెస్టు చేసి పోలిస్‌స్టేషన్ తరలించారు. అరెస్టు అయిన నాయకుల్లో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సింగారపు రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ది కృష్ణమూర్తి, మహ్మద్ జాకీర్, పులిపంపుల భాస్కర్, భూక్య మల్లేష్, బట్ట అబ్బయ్య, మాధవరెడ్డి ఉన్నారు.