Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
డీఫ్లోరైడ్ ప్రాజెక్టు పరిశీలన
నవతెలంగాణ-నర్సంపేట
ప్రమాదపు అంచుల్లో ఉన్న డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు వరద నీటి మళ్లీంపు కోసం వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను సూచించారు. రాత్రి నుండి కురుస్తున్న కుండపోత వర్షానికి ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని ఢఫ్లోీరైడ్ ప్రాజెక్ట్ లోకి వరద నీరు అధికంగా చేరడం వల్ల ప్రమాదం పొంచి ఉందనే సమాచారంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఢ ఫ్లోరైడ్ జలాశయాన్ని సందర్శించారు. భారీగా వరదనీరు చేరుకోవడం వల్ల కట్టకు ముప్పు ఉందని గుర్తించారు. పరిస్థితులను అధికారులతో చర్చించారు. వెంటనే మరమ్మతు పనులు చేయాలని ఎమ్మెల్యే పెద్ది రూ. 50వేల నగదును ఎంపీపీకి అందచేశారు. వెంటనే యంత్రాలను ఏర్పాటుచేసి వరద నీటిని మళ్లించే పనులను చేపట్టి పొంచి ఉన్న ప్రమాదం నుంచి గ్రామ ప్రజలను కాపాడాలని సంబంధిత అధికారులను సూచించారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి, నర్సంపేట ఆర్డీఓ పీ.పవన్ కుమార్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సర్పంచ్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.