Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ చౌరసా..
సోమవారం భారత్‌బంద్ సందర్భంగా ఉదయం 4 గంటలకే అఖిలపక్షం ఆధ్వర్యంలో హన్మకొండ బస్టాండ్ వద్ద నిరసన తెలియచేశారు. డిపోల నుంచి బస్సులను కదలనీయకుండా అడ్డుకున్నారు. నిరసన తెలుపుతున్న అఖిలపక్షం నాయకులను పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంద్‌కు సహకరించాలని హన్మకొండ వేయి స్థంబాల గుడి నుంచి కాజిపేట వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎస్. వాసుదేవ రెడ్డి, నాయకుడు జీ ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ కార్యదర్శి మేకల రవి, తెలంగాణా ఉత్తర జిల్లాల కో-ఆర్డి నేటర్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, ఏఐవైఎఫ్ నాయకుడు సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి, న్యూ డెమోక్రసీ నాయకుడు అరెల్లి కష్ణ తదితరులు పాల్గొన్నారు.