Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సింహులపేట
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ స్పష్టం చేశారు. పోలీసులు 95 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం చేసుకుని లారీ ని సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేయగా పోలీస ్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. మండలంలోని కొమ్ములవంచ మధుతండా శివారులో నల్లబెల్లం రవాణా చేస్తుండగా ఎస్సై నరేష్ కుమార్ ఆదేశాల మేరకు ఏఎస్సై మహేందర్ ఆధ్వర్యంలోని బలగాలు లారీలోని అదుపులోకి తీసుకుని అందులో ఉన్న సుమారు రూ.4.95 లక్షల విలువైన 95 క్వింటాళ్ల నల్లబెల్లం, రెండు క్వింటాళ్ల పటికను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నలుగురు నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా ఒకరు పరారైనట్టు డీఎస్పీ చెప్పారు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నల్లబెల్లం, పట్టికను తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకొచ్చి మండల కేంద్రంలోని పరిసర గ్రామాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే దేన్ని కూడా సహించేది లేదని స్పష్టం చేశారు. రెండోసారి నేరానికి పాల్పడ్డ వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. ఎస్సై నరేష్కుమార్, ఏఎస్సై మహేందర్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, ప్రణీత్, డ్రైవర్ సురేష్‌లకు డీఎస్పీ రివార్డులు అందించి అభినందించారు. సమావేశంలో తొర్రూరు సీఐ కరుణాకర్, ఎస్సై తారాచందర్, కానిస్టేబుళ్లు యాకన్న, చైతన్య పాల్గొన్నారు.