Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
వాతావరణ శాఖ సూచనలు మేరకు భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య సోమవారం ఒక ప్రకటనలో కోరారు. నీటి పారుదల, విద్యుత్, ఇరిగే షన్ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను మానిటరింగ్ చేయాలని కోరారు. ప్రత్యేక అధికారులు, ఇరిగేషన్ ఇంజనీర్లు, తహసీల్దార్లు లోతట్టు ప్రాం తాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. పోలీసు యంత్రాంగం ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. గోదావరి పరివాహక ప్రాంతం పరిసర గ్రామాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. జిల్లా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 0520 ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు.