Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఎంహెచ్ఓ అప్పయ్య
నవతెలంగాణ-వెంకటాపూర్
ప్రతిఒక్కరూ కరోనా నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్ వేయించుకోవాలని డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. మంగళవారం ఆయన నారాయణపురం, అంధులగకమేది, నర్సింగపూర్, నల్లగుంటాల్లోని టీకా కేంద్రాలను పరిశీలించారు. అనంతరం గ్రామాల్లో తిరుగుతూ టీకాలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేశారు. గ్రామాల్లో టీకాలు వేసుకుని వారిని గుర్తించి వారికి టీకాలు వేయించినట్టు పేర్కొన్నారు. వర్షాకాలంని దష్టిలో ఉంచుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వేడి ఆహారాన్ని భుజించాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని పాచిపోయిన ఆహార పదార్థాలు తినకూడదని తెలిపారు. 18ఏండ్లు పైబడిన అర్హులైన వారందరూ టీకాలు తీసుకునే విధంగా ప్రజలు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.