Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తాడ్వాయి
మేడారానికి చెందిన చెరుకుల చందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హనుమకొండలోని లాస్య ఆస్పత్రిల్లో వైద్యం చేయించు కుంటున్నాడు. అతడి తలకు ఆప రేషన్ చేయాలని, మూడు లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో అభ్యుదయ యువజన సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన భోజారావు, కార్యదర్శి గడిగ అనిల్ ఆధ్వర్యంలో సభ్యులు కురసం రవి, ఆలం సమ్మయ్య, జనార్ధన్, కొక్కెర పూర్ణచందర్, అలం వెంకటేష్‌లు తలా కొన్ని డబ్బులు వేసుకోవడంతో పాటుగా స్థానిక షాపులు, దుకాణందారుల వద్ద చందాలు వసూలు చేసి రూ.లు 38వేలను బాధిత కుటుంబానికి వైద్యఖర్చుల నిమిత్తం అందజేశారు. గ్రామస్తులు అభ్యుదయ సంఘం నాయకులను అభినందించారు. -