Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్
నవతెలంగాణ-నర్సంపేట
పాలిటెక్నిక్ విద్యార్థి సంజరు మతికి కారణమైన కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఐక్య విద్యార్థి సంఘాల సమావేశంలో యార ప్రశాంత్, బొట్ల నరేష్, మొగిలిచర్ల సందీప్, కొమ్ముక రవిలు మాట్లాడారు. బిట్స్ కాలేజ్ లో పాలిటెక్నిక్ సెకండియర్ చదువుతున్న సంజరు మతి చెంది ఐదు రోజులు గడుస్తున్న ఇప్పటికీ బిట్స్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డిని నేటి వరకు అరెస్ట్ చేయకపోవడం లో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మిగతా విద్యార్థులను అరెస్టు చేసి ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. విద్యార్థి మతికి ప్రదాన కారకులైన బిట్స్ కాలేజ్ చైర్మన్‌పై పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి ఏ1గా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థినికి కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమం ఉధతం చేస్తామని హెచ్చరించారు.