Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
భగత్ సింగ్ స్పూర్తితో యువత ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ అన్నారు. స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో భగత్ సింగ్ 114వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రాకేష్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భగత్ సింగ్ దేశ విముక్తి కోసం నిరంతరం పోరాట స్ఫూర్తి ప్రదర్శించారన్నారు. 23 యేండ్లకే దేశం కోసం తన ప్రాణాలను అంకితం చేశాడన్నారు. ఆయన స్ఫూర్తితో నేటి యువత విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాల్లోకి రావాలన్నారు. యువలోకం భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాటాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తరుణ్, కిషోర్, భూక్య అనిల్, కష్ణ, రోహిత్, శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించాలి
నవతెలంగాణ-హన్మకొండ
భగత్ సింగ్‌ను ఆశయాలను కొనసాగించాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకుడు మంద సంపత్ అన్నారు. మంగళవారం అదాలత్ సెంటర్లో భత్సింగ్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం), డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు యకయ్య, దూడపాక రాజేందర్, మేకల రగుపతి, బొల్లారం సంపత్, కంచర్ల కుమారస్వామి, నోముల కిశోర్ తదితరులు పాల్గొన్నారు
నవతెలంగాణ-కాశిబుగ్గ
భగత్‌సింగ్ స్ఫూర్తితో యువత సమస్యలపై ఉద్యమించాలని పీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ పిలుపునిచ్చారు. స్థానిక వెంకట్రామా థియేటర్ సమీపంలో మంగళవారం భగత్ సింగ్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు జంగం రజిత, ప్రభాకర్, జగన్నాథ చారి, ఎస్కే రైమత్, రేగూరి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-పర్వతగిరి
స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద భగత్ సింగ్ 114 వ జయంతిని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వ్యకాస మండల కా ర్యదర్శి మాదాసి యాకూబ్, సీఐటీయూ మండల కన్వీనర్ జిల్లా రమేష్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బొట్ల కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-చెన్నారావుపేట
మంగళవారం మండల కేంద్రంలో ఏఐఎఫ్డీఎస్ నాయకుడు జన్ను రమేశ్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
నవ తెలంగాణ-నల్లబెల్లి
స్థానిక బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ సెంటర్లో ఏబీఎస్ఎఫ్్, దళిత విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం గుర్రం జాషువా, భగత్ సింగ్ జయంత్యోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, రవి, నరేష్, రాకేష్ పాల్గొన్నారు.
నవతెలంగాణ - ములుగు
మంగళవారం జంగాలపల్లిలో ఏర్పాటు చేసిన భగత్‌సింగ్ జయంతి వేడుకలకు డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భగత్ సింగ్ విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలన్నారు. నేటి తరం యువత భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కలువల రవీందర్, పత్రి రాజు, పట్టణ నాయకులు వేణు, చంటి, సద్దాం హుస్సేన్, రాజేందర్ వెంకటేష్, శివ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగ ాణ-వెంకటాపూర్
ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రా మంజాపుర్లో భగత్‌సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోదిల రాజ్ కుమార్ మాట్లాడారు. భగత్‌సింగ్ స్ఫూర్తితో యువత సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు యూనిట్ కమిటీ సభ్యులు బుర్ర రాజేందర్, బొబ్బిలి గణేష్ , పౌడల కళ్యాణ్ , పల్లకొండ శ్యామ్, అభినవ్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.