Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంపీడీఓ కుమారస్వామి
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
కరోనా మహమ్మారిని అంతం చేయడానికి కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని ఎంపీడీఓ కుమారస్వామి అన్నారు. మండలంలోని నమిలిగొండ గ్రామంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయిన సందర్భంగా మండల ప్రత్యేకాధికారి నర్సయ్య, సర్పంచ్ డ్యాగల ఉప్పలస్వామి, ఎంపీటీసీ పురుమాని రజాక్, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ రెండు డోసుల ప్రక్రియ నూరు శాతం పూర్తిచేయడం సంతోషకరమని అన్నారు. సహకరించిన వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేసి టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆశా, అంగన్ వాడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.