Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తరిగొప్పుల
మండలంలోని అక్కరాజుపల్లి, పోతారం, సోలిపురం గ్రామాలను మంగళవారం కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన భారీవర్షాలకు తెగిపోయిన రహదారులను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో జరుగుతున్న హరితహారం పనులు, పనిప్రదేశంలో వాచర్స్ వివరాలు అడిగి తెలుసు కున్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనాలను సందర్శించి వివరాలు తెలు సుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగ కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం పోతారం సోలిపురం గ్రామాల మధ్య చెడిపోయిన రోడ్డును పరిశీలించి అధికారులకు సూచనలి చ్చారు. వాగుల వద్ద నిరంతర నిఘా ఉండాలని, వాహనాలు, పాదాచారులు వెళ్ళకుండా రహదారిని మూసి, ప్రత్యామ్నాయ దారుల గుండా ప్రజలు వెళ్లేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు అమ్మిర్షెట్టి వీరేందర్, ఎండబట్ల అంజమ్మ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఇంద్రసేనారెడ్డి, తహసీల్ధార్ మహమ్మద్ పరిదుద్దిన్తోపాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.