Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
ఈ నెల 30న జిల్లా కేంద్రంలోని అంగడి మైదానంలో జరిగే కాంగ్రెస్ భారీ బహిరంగ సభ విజయవంతం చేయా లని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు, కాబోయే కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావు కోరారు. మంగళవారం భూపాలపల్లి కేటీకే-1 ఇన్క్లైన్లో గేట్ మీటింగ్ లో డీసీసీ జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డితో కలిసి సత్యనారాయణరావు మాట్లాడారు. భూపాలపల్లిలో జరిగే బహిరంగ సభకు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. ఈ క్రమంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రామిక వర్గాలకు అన్యాయం చేస్తూ మాయమాటలు చెప్పి యూనియన్ ఎన్నికలో గెలవాలని చూస్తున్నదన్నారు. వారి మోసాలను తెప్పికొట్టాలని సింగరేణి హాస్పిటల్లో ఖాళీ వైద్య పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. సింగరేణి నిధులను భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో పూర్తి స్థాయి అభివృద్ధికి ఉపయోగించాలని అన్నారు. పక్క నియోజకవర్గ అభివృద్ధి నిధులు దారి మల్లు తున్నా దుర్వినియోగం చేస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు తమకు పట్టనట్టు చూస్తున్నారని అన్నారు. సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు జోగా బుచ్చయ్య, పసునూరి రాజేందర్, కాంగ్రెస్ నాయకులు దేవన్, కౌన్సిలర్లు ఉడుత సరోజన, దాట్ల శ్రీనివాస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు రామినేని రవీందర్, బుర్ర కొమురయ్య, అంబాల శ్రీనివాస్, రంజిత్, రాజేందర్, రజినీకాంత్, లతోపాటు ఐ ఎన్ టి యు సి యూనియన్ నాయకులు,వివిధ విభాగాల అధ్యక్షులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి : రవళి
నవతెలంగాణ-టేకుమట్ల
ఈ నెల 30న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూచన రవళి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కూచన రవళి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరవుతున్నందున మండలం లోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రానున్న రోజుల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు. ఏఐఎఫ్బి నాయకుడు గండ్ర సత్య నారాయణరావు కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలిపారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ సభ్యులు నాంపల్లి వీరేశం శాస్త్రాల కిరణ్, నాయకులు మాట్లా వెంకటేష్, శెట్టి కిషన్, లింగయ్య, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.