Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
చిట్యాల మండల కేంద్రం నుండి మొగుళ్లపల్లి వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని, కాంట్రాక్టర్లు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నేరెళ్ల ఓదలు అన్నారు. మంగళవారం నవాబుపేట గ్రామంలో రోడ్డు పనులను పరిశీలించి ఆయన మాట్లాడారు. రోడ్డు పనులు ప్రారంభించి నాలుగు నెలలు పూర్తవుతున్నా నిర్మాణంలో ఆలస్యం జరుగుతుందని వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రోడ్డుపై కంకర పోసి వదిలివేయడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. పనుల్లో నాణ్యతాలోపాలున్నాయని, సదరు కాంట్రాక్టర్ రోడ్డుకు ఇరువైపులా సమాంతర రోడ్డు పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. చిట్యాల మండల కేంద్రం నుండి నవాబుపేట మీదుగా మొగుళ్లపల్లి వరకు జరిగే రోడ్డు పనుల్లో నాణ్యతలోపంతో కొద్ది రోజులకే చెడిపోయే ప్రమాదముందన్నారు. పనులను పర్యవేక్షించాల్సిన ఆర్అండ్బీఅధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే కలెక్టర్ స్పందించి నాణ్యత పాటించేలా చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు.