Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భయాందోళనలో విద్యార్థులు,
ఉపాధ్యాయులు
నవతెలంగాణ-గూడూరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమవుతున్న పరిస్థితి. ఇందుకు మండలంలోని మరిమిట్ట గ్రామ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల భవనమే నిదర్శనం. నేడు పాఠవాల భవనం శిథిలావస్థలో ఉంది. ఇందులో 21మంది విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏంజరుగుతుందోనని జంకుతున్నారు. 1997లో నాటి టీడీపీ ప్రభుత్వం నిధులు కేటాయించి భవనాన్ని నిర్మించింది. నేటి వరకు భవనానికి ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. మండల, జిల్లా అధికారులు, ప్రజాప్రతి నిధులు, డీఈవోకు విన్నవించినా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. రెండేండ్లుగా కరోనా నేపథ్యంలో పాఠశాల నిరుపయోగంగా ఉంది. ఇటీవల పునర్ ప్రారంభించినా మరమ్మతులు చేపట్టలేదు. పాఠశాల భవనం బేస్మెంట్ లెవెల్ వద్ద బావి ఉండడంతో భవనం కూలిపోయే ప్రమాదం ఉంది. పాలకులు స్పందించి నూతన భవన నిర్మాణం చేపట్టి, మౌలిక వసతులు కల్పించా లని విద్యార్థులు , వారి తల్లిదండ్రులు ఉపాధ్యా యులు కోరుతున్నారు.