Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
సమాజంలో బాలికలకు బంగారు భవిష్యత్‌ను అందించేలా కషి చేయాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ వసుధ అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ యమునా రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్యవివాహాల నిర్మూలన, బాల కార్మికుల నిర్మూలన, లింగనిర్ధారణ నిర్మూలన, అక్రమ రవాణా, అక్రమ దత్తత గురించి ప్రజలకు వివరించారు. గ్రామాలలో గుట్టుచప్పుడు కాకుండా బాల్యవివాహాలు జరుగుతున్నాయని, తమ దష్టికి వచ్చిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. సేలం జిల్లా కో-ఆర్డినేటర్ వీరబాబు మాట్లాడుతూ.. 18ఏండ్ల లోపు పిల్లల కోసం చైల్డ్‌లైన్ పని చేస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 848బాల, బాలికలుకు సర్వీస్ ఇచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ జిల్లా సభ్యులు రమేష్, సతీష్, నిర్మల మేరీ, ప్రభా, ఏసీడీపీఓ విద్య, సూపర్వైజర్ శ్యామలాదేవి, ఎంఈఓ రత్నమాల, డాక్టర్ రమేష్, వైస్ ఎంపీపీ పుండరీకం, ఎంపీటీసీ కరిష్మా పాల్గొన్నారు.