Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా కలెక్టర్ సీిహెచ్ శివలింగయ్య
నవతెలంగాణ-జనగామ
రైతులు నష్టపోకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, జిన్నింగ్ మిల్లర్లతో కలెక్టర్ 2021-22 వానాకాలం పత్తి కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి తర్వాత పత్తి పండించే విస్తీర్ణం ఉన్నట్లు తెలిపారు. కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోళ్ళు చేయాలన్నారు. వానాకాలం లో లక్షా43వేల589 ఎకరాల్లో పత్తిని పండించారని, సుమారు లక్షా14వేల499 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో 13, హన్మకొండ జిల్లాకు చెందిన 2, ఈ సంవత్సరం కొత్తగా నిర్మించబడ్డ 2 జిన్నింగ్ మిల్లులు సీసీఐతో ఒప్పందం చేసుకున్న తర్వాత నోటిఫై చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. నోటిఫై అయిన అనం తరం వానాకాలం కొనుగోళ్ళు చేపట్టనున్నట్లు తెలి పారు. జిల్లాలో 8 నాబార్డు గోడౌన్లు 40 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిఉన్నాయని, 17 వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్లు 19 వేల 800 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల్గి ఉన్నట్లు చెప్పారు. ఈ సీజన్‌కు మార్కె టింగ్‌శాఖ ద్వారా 30వేల టోకెన్లు అందుబాటులో ఉంచామన్నారు. లాంగ్ స్టాపుల్ లెంగ్త్ పత్తికి క్వింటా లుకు రూ.6 వేల25, మీడియం స్టాపుల్ లెంగ్త్ పత్తికి రూ.5వేల726 కనీస మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. రైతులకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా కనీస మద్దతు ధర పొందేందుకు, నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రానికి తెచ్చేలా ప్రచారం కల్పిం చాలన్నారు. తూకం యంత్రాలను అన్నిచోట్లా ముందస్తుగా తనిఖీలు చేసి, తూనికలు కొలతల శాఖ అధికారులు ధ్రువీకరణ ఇవ్వాలన్నారు. కొనుగోలు సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వ్యవసాయ అధికారి ప్రతి కొనుగోలును పర్యవేక్షణ చేయాలన్నారు. కాటన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని అన్నారు. ఒకేచోట సీసీఐ, ప్రయివేటుగా కొనుగోళ్ళు జరుగనున్నందున ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని, రికార్డులను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వివరాలు, అమ్మకానికి కావాల్సిన ఆధార్ తదితర పత్రాల విషయమై గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. పత్తి పంట వేసిన ప్రతి రైతు, కౌలుదారుడైనా సరే వారి పేరు, పంట వివరాలు వ్యవసాయ శాఖ వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. కేంద్రం వద్ద కనీస మద్దతు ధర, తేమ శాతంలతో సీసీఐ ద్వారా బ్యానర్ ఏర్పాటు చేయాలన్నారు. లైసెన్స్ లేని వ్యాపారస్తులకు తమ పంటను అమ్మి మోసపోవద్దని రైతులను కోరారు. లైసెన్స్ లేని వ్యాపారస్తులు పత్తి కొనుగులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిన్నింగ్ మిల్లుల వద్ద అగ్ని మాపక శాఖ ద్వారా అగ్నిమాపక తనిఖీలు చేయాలన్నారు. మిల్లులకు 24 గంటలు నిరాటంక విద్యుత్ సరఫరాకు చర్యలు తీసు కోవాలన్నారు. అధికారులు సమన్వయంతో కొనుగోళ్ళు సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి కె. నాగేశ్వర శర్మ, జిల్లా వ్యవసాయ అధికారిణి టి. రాధిక, తూనికలు, కొలతల అధికారి ఎస్. విజరు కుమార్, సీసీఐ సివోలు కె. తిరుమల రావు, యు.ఎన్. వాంఖేడే, జనగామ, కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శులు జి. జీవన్ కుమార్, ఎస్. నిరంజన్, జిన్నింగ్ మిల్లర్లు పాల్గొన్నారు.
నిధులు మంజూరు చేయాలి : గ్రామస్థులు
నవతెలంగాణ-నర్మెట్ట
ఆగపేట లో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న సైడ్ డ్రయినేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరారు. గురువారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఆగపేట గ్రామస్థులు జనగామలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే నిధుల మంజూరు గురించి కలెక్టర్‌తో మాట్లాడి మంజూరయ్యేలా చూస్తానని హామీనిచ్చారని తెలిపారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు మేడబోయిన రాజు, సర్పంచ్ ముప్పిడి లక్ష్మి -విజయప్రతాప్, ఎంపీటీసీ ఏర్పుల చైతన్య, సీనియర్ నాయకులు కోనేటి మల్లేశం, సల్మాన్‌రెడ్డి, భాస్కర్, సోషల్ మీడియా ఇన్చార్జి గణేష్ పాల్గొన్నారు.