Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదనపు కలెక్టర్‌కు అఖిలపక్షం మెమొరాండం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకొని ప్రజలకిచ్చిన హామిలను అమలు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ చేశారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు అఖిలపక్షాలు ధర్నా నిర్వహించాయి. దేశంలో 19 రాజకీయ పార్టీల తరుపున పలు డిమాండ్లను వినతిపత్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుంచారు. రైతు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను, విద్యుత్ సవరణలను వెనక్కి తీసుకోవాలని, కార్మిక కోడ్లను ఉపసంహరించుకోవాలని, కార్మిక హక్కులను రక్షించాలని కోరుతూ హన్మకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శులు సారంపల్లి వాసుదేవరెడ్డి, సీహెచ్ రంగయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, న్యూడెమొక్రసి జిల్లా కార్యదర్శి నున్నా అప్పారావు 17 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణికి గురువారం వినతిపత్రం సమర్పించారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, మద్దతు ధరకు అమ్ముకునే హక్కును కల్పిస్తూ చట్టం తేవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన పన్నులను వెంటనే ఉపసంహరించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ, అమ్మకాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కార్మిక కోడ్లను రద్దు చేయాలని, సమ్మె హక్కును, వేతనాల కోసం బేరసారాల హక్కులను పునరుద్ధరించాలన్నారు. ప్రజలపై నిఘా పెట్టేందుకు పెగాసస్ గూడచర్య స్పైవేర్ వినియోగించడంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ వెంటనే జరపాలని డిమాండ్ చేశారు. దేశద్రోహం, జాతీయ భద్రత చట్టం వంటి దుర్మార్గపు చట్టాలను ఉపసంహరించుకోవాలని, అటవీ హక్కుల చట్టం, పీసా చట్టాలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు వేం నరేందర్‌రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, దొమ్మాటి సాంబయ్య, సీపీఐ(ఎం) నాయకులు జి. ప్రభాకర్‌రెడ్డి, ఎం. చుక్కయ్య, నలిగంటి రత్నమాల, సింగారపు బాబు, మాలోత్ సాగర్, వీరన్ననాయక్, గొడుగు వెంకట్, సీపీఐ నాయకులు కర్రె భిక్షపతి, సయ్యద్ ఉల్లా వలీ ఖాద్రీ, ఆరెల్లి క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.