Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆర్ఏప్ఐడి గుర్తింపు కార్డులకు చర్యలు
అ ఆన్లైన్లో ఉపాధ్యాయులు సమగ్ర సమాచారం
అ మండలంలో సమయపాలన పాటించని వైనం
నవతెలంగాణ-మల్హర్రావు
అకారణంగా సెలవులు పెట్టకుండా విధులకు డుమ్మా కొడు తున్న టీచర్లకు చెక్ పెట్టడానికి విద్యాశాఖ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మారుమూల గ్రామాలు, తండాల్లోని పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టడం మరికొందరు ఆలస్యంగా వస్తూ హాజరు వేసుకోవడం ఇంకొందరు ఉపాధ్యాయులు నాయకులమంటూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తు న్నారనే ఫిర్యాదులు ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు నుంచి తరుచుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లుతున్నాయి. దీంతో నిర్లక్ష్య పద్ధతికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేసినట్లు సమాచారం. అదునూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రత్యేక చిప్‌తో కూడిన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిపికేషన్ (ఆర్ఏప్ఐడి) కార్డులను త్వరలోనే జారీ చేసేందుకు ప్రక్రియ చేపట్టనుంది. కరోనా అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల హాజరు శాతాన్ని ఇంకా పెంచేలా కార్పోరేట్ ప్రయివేటు పాఠశాలకు దీటుగా నాణ్యమైన విద్యానందించేలా ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా విధుల్లో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయుల తీరు మెరుగు పర్చడంతో సహా బడికి ఎగనామం పెట్టి తరువాత వచ్చి హాజరు వేసుకోవడం ఇద్దరు ఉన్న చోట వంతుల వారిగా హాజరయ్యే పద్ధతికి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
ప్రాథమిక పాఠశాలాల్లోనే డుమ్మా...
మండలంలో 5 జిల్లా పరిషత్, ప్రాథమిక 27, ప్రాథమికోన్నత 2, ఒక మోడల్ స్కూల్, ఒక కస్తూర్బా ఆశ్రమ పాఠాశాలు ఉన్నాయి. మోడల్ స్కూల్లో మొత్తం 450 మంది, మిగతా (కస్తూర్బా తప్ప ) పాతలల్లో 1347 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందుకు మొత్తం 124 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి%శీ%ది 97 మంది మాత్రమే ఉపాద్యాయులు ఉన్నారు. పాత రుద్రారం, పివి నగర్, రామారావుపల్లి, నాచారం, దబ్బగటు గ్రామాల్లో ప్రాథమిక పాటశాలల్లో ఉపాద్యాయులు విధులకు సమయ పాలన పాటిం చకుంటే, మరికొందరు విధులకు మొత్తానికి డుమ్మా కొడుతున్న పరిస్థితి. ఇందుకు నిదర్శమే. గురువారం పాత రుద్రారం ప్రాథమిక పాఠశాలకు ఉపాద్యాయులు రాకపోవడంతో విద్యార్థులే పాఠాలు బోధించుకున్నారు.
ఆర్ఏప్ఐడి గుర్తింపు ఇలా...
అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే ఆర్ఏప్ఐడి కార్డులను జారీ చేసే ప్రక్రియ ఇలా ఉంటుంది. టీచర్ ఫొటో, పూర్తి పేరు, పుట్టిన ప్రాంతం, ప్రస్తుత నివాసం, పుట్టిన తేదీ, సెల్ ,ఆధార్, పాన్ కార్డు నెంబర్లు గతంలో ఎక్కడెక్కడా పని చేశారు, ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు, జిత బత్యాలు, హౌదా సహా సమస్త సమగ్ర సమాచారం నిక్షిప్తమై ఉండేలా ఎలక్ట్రానిక్ సిప్ తో కూడిన గుర్తింపు కార్డులను ప్రత్యేకంగా రూపొందిస్తోంది. రెండేళ్ల క్రితమే ఈ విధానాన్ని అమలు చేయాలని భావించిన కరోనా కారణంగా స్కూల్స్ మూత పడటం వంటి కారణాలతో ప్రతిపాదన ఆగిపోయింది. గుర్తింపు కార్డులు టీచర్ల పదోన్నతులు బదిలీలు ఇతర ప్రయోజనాలకు ప్రామాణికంగా ఉండడంతో సహా బదిలీ పదోన్నతులు కన్సిలింగ్ సందర్భాల్లో సినియార్టీ వంటి సర్వీస్ అంశాల్లో ఎదురవుతున్న పలు సమస్యలకు అధునాతన ఆర్ఏప్ఐడి గుర్తింపు కార్డులతో చెక్ పడుతోంది. ఆన్లైన్లో ఆటోమేటిక్ గా సినియార్టీ జనరేట్ అవడం వల్ల ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఆన్లైన్లో కన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టడానికి వీలవుతుందని విద్యాశాఖ వర్గాలు తెలుపుతున్నాయి.
తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి
పలు పాఠశాలల్లో ఉపాద్యాయులకు బదులుగా తాత్కాలికంగా బయట వారిని పెట్టుకొని బోధన చేయిస్తూ కొందరు ఉపాద్యాయులు ప్రయివేటుగా స్కూళ్ళు, కాలేజీలు నడిపిస్తుండటం, పాఠశాలల వేళల్లో ప్రయివేటు వ్యాపకాలు, రియల్ ఎస్టేట్, చీట్స్, పైనాన్స్ దందాల్లో, పార్టీల కలపాల్లో, సమాజిక సంఘాల కార్యక్ర మాల్లో మునిగి తెలుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఎంపీ,ఎమ్మెల్యేల ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగతంగా ప్రచారం చేస్తున్నారని సస్పెన్షన్ వేటు పడినవారు సైతం ఉన్నారు. అంతేకాకుండా తేదీ వేయకుండా రాసి పెట్టిన సెలవు దరఖాస్తును రిజిస్టర్ పెట్టి ఎవరైనా తనిఖీలకు వచ్చినప్పుడు తేదీ వేసి సిఎల్ పెట్టడం, లేదంటే మరుసటి రోజు వచ్చి సంతకాలు పెట్టుకోవడం వంటి అక్రమాలెన్నో విద్యాశాఖ అధికారుల ప్రత్యేక బృందాల తనిఖీల్లో వెలుగు చూశాయి.
సరికొత్త విధానంలో నిబంధనలు ఇలా...
సరికొత్త విధానంలో సమయ పాలన పాటించాలి. లేదంటే రెండుసార్లు అవకాశం ఇచ్చి మూడోసారి సిఎల్ పడేలా బయోమెట్రిక్ సాప్ట్‌వేర్‌ను రూపొందించారు. ప్రార్థన సమయానికి వారంలో రెండు సార్లు రాకుంటే మిషన్ లో ఎల్లోజోన్ సిగల్ చూపి వార్నింగ్ ఇస్తోంది. అయినప్పటికీ మూడోసారి కూడా ఆలస్యంగా హాజరైతే రెడ్ జోన్ చూపుతోంది. ఇలా చూపిన వారికి చార్జీ మెమోలు జారీ చేసి సంజాయితి కోరడం అప్డే సెలవు వేయడం జీవో 128 ప్రకారం ఏడాది కన్నా ఎక్కువ కాలం అధికారిక విధులకు గైహాజరైతే సదరు ఉపాద్యాయుని ఉద్యోగానికి రాజీనామా చేసినట్లే. సెలవు పెట్టిన పెట్టాకపోయిన ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం విధులకు హాజరు కాకపోయిన రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటేషన్ మంజూరు చేసిన కాలానికంటే ఎక్కువ కాలం ఉన్న రాజీనామా చేసినట్లుగానే పరిగణించడానికి తదితర శాఖాపరమైన చర్యలకు విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. పాఠశాల విద్యాశాఖ సంచాలకు రాలు దేవసేన 2021 జూన్ లోనే విధులకు డుమ్మా కొడుతున్న టీచర్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆమె ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అధ్యయనం చేసి భవిష్యత్ లో ఇలాంటివి తలెత్తకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించేందుకు ఈ ఆర్ఏప్ఐడి గుర్తింపు కార్డుల ప్రక్రియకు ప్రస్తుతం పూనుకున్నట్టు సమాచారం.