Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వెలికట్టెలో కార్డన్ సెర్చ్
అ 7 ట్రాక్టర్లు, 20 బైక్‌లు, భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
అ మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి
నవతెలంగాణ-తొర్రూరు
అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్పష్టంచేశారు. మండలంలోని వెలికట్టె గ్రామంలో పోలీసులు గురువారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడారు. అక్రమ వ్యాపారాలను, అసాంఘీక శక్తులను అడ్డుకునేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్టు తెలిపారు. దాడుల్లో 7 ఇసుక ట్రాక్టర్లను, 20 బైక్‌లను, రూ.25 వేలు విలువైన మద్యం బాటిళ్లు, రూ.20 వేలు విలువైన గుట్కా ప్యాకెట్లు, 500 కిలోల బెల్లం, 13 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ నిషేధిత గుట్కా, నల్లబెలం, అక్రమ మద్యం, తదితరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత శిక్షణను అర్హులు వినియోగించుకోవాలని కోరారు. పిల్లలను తల్లిదండ్రులను కనిపెడుతూ ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరమణ, సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై సతీష్, 8 మంది ఎస్సైలు, సుమారు 100 మంది పోలీసులు, సర్పంచ్ పోసాని పుష్పలీల, నాయకులు పోసాని రాములు, ఎంపీటీసీ మల్లమ్మ, యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.