Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
దళిత కాలనీల్లో ప్రతి నెలా ఏర్పాటు చేయాల్సిన సివిల్ రైట్స్ డేను నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.దళితుల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి నెల 30న ఏదైనా ఒక గ్రామంలో సివిల్ రైట్స్ డే నిర్వహించాల న్నారు. అధికారులు ఇతర కార్యక్రమాలకు ఇచ్చిన ప్రాధా న్యత సివిల్ రైట్స్ డేకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. సంబంధిత అధికారులు స్పందించి దళితుల సమస్యలు పరిష్కరించేందుకు పాటుపడాలన్నారు. సివిల్ రైట్స్డే నిర్వహించి అంబేద్కర్ సంఘం, దళిత సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటర్ కమిటీ నాయకులను పిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్, జిల్లా సాంస్కతిక కార్యదర్శి జన్నే యుగేందర్, మండల అధ్యక్షుడు బొడ్డు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.