Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మౌలిక వసతులు కల్పించాలి
అ ఏసీరెడ్డినగర్ కాలనీవాసులు
నవతెలంగాణ-జనగామ
ఏసీరెడ్డినగర్ డబుల్‌బెడ్ రూమ్ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 60వ రోజు కొనసాగాయి. డబల్ బెడ్ రూమ్ కాలని వాసి వడ్డేపల్లి బ్లెస్సింగ్ టాన్ దీక్షలను ప్రారంభించి మాట్లాడుతూ 60 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పట్టించుకోక పోవడం దారుణమన్నారు. కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి ఉన్న ఇండ్లను త్యాగం చేసి ఇస్తే, పునరా వాసం పథకం కింద నిర్మించిన ఇండ్లలో మౌలిక వసతులు కల్పించకుండా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రెవెన్యూ అధికారులు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి 3నెలలు దాటినా అభివృద్ధి చేయక పోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఉననతాధికారులు స్పందించి మౌలిక సౌకర్యాలు కల్పించకుంటే కలెక్టర్, మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిం చారు. ఎండీ రజియా, అన్నపూర్ణ, కోటయ్య, కళ్యాణి, అనిత, సుగుణ, సోమయ్య, శాంతమ్మ పాల్గొన్నారు.