Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-మల్హర్రావు
ఇటీవల కురిసిన వర్షాలకు, ఎల్ఎండీి ప్రాజెక్టు గేట్ల ఎత్తివేతతో వరద ముంపునకు పంటలు నష్టపో యిన రైతులకు నష్టపరిహారం అందించడంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని నియోజ కవర్గ రైతుల కంట కన్నీరే మిగిలిందని విమర్శించారు. సాగుకు చుక్క నీరు రాదని, అతివృష్టి వర్షాలు వస్తే సాగు చేసే పంటలు నిండా మునుగుడేనని, కనీసం వరద రాకుండా మానేరు పరివాహక ప్రాంతాల్లో కరకట్టలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో కాళేశ్వరం ప్రాజెక్టు అతి పెద్దదని గొప్పలు చెప్పుకోవడం తప్ప మంథని నియోజకవర్గనికి చేసిందేమీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టినప్పటి నుండి నిర్మాణంలో ఇంజనీరింగ్ తప్పిదం ఉందని ప్రభుత్వానికి అనేకమార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వల్ల పై నుంచి నీటి ప్రవాహం వచ్చినప్పుడు సాంకేతిక ఇబ్బందులను ఆలోచించకుండా నీటిని వదలడం, అధికారులు ముందస్తు చర్యలు తీసుకోక పోవడం అనాలోచితమైన చర్యన్నారు. ఒకే నెలలో మూడు సార్లు కాళేశ్వరం బ్యాక్ వాటర్ ద్వారా పంట నష్టం జరిగినా రెవెన్యూ ,వ్యవసాయ యంత్రాంగం స్పందించకపోవడం బాధాకరమన్నారు. బ్యాక్ వాటర్ ద్వారా మంథని నియోజకవర్గంలో వేలాది మంది రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్ల ప్రజాధనాన్ని నష్టపోవడం జరిగింది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నా రైతుల పొలలకు నష్టం వాటిల్లుతుం దన్నారు. నష్టపోయిన రైతుల భూములను భూసేకరణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కౌలు రైతులను ఆదుకుని వారికి కూడా రైతుబంధును అమలు చేసేలా చూసి పంట నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్ర సర్వే, సమగ్ర నివేదికలు తయారు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. లోతట్టు గ్రామాలకు ప్యాకేజీ ప్రకటించాలని, ప్రకృతి వైపరీత్యలను సూచికగా తీసుకొని నష్ట పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు.