Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘణపురం
జీఎంపీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని నాగారం, నెల్లుట్ల గొల్లకురుమ సంఘంనాయకులు, కంకర క్రషర్ యాజమాని గుడిపాటి సత్యనారాయణ రెడ్డి, బాలజీ ఇన్ఫ్రో క్రషర, అనుష ఇన్ ఫ్రో ప్రాజెక్టు యాజమాన్యాలతో గురువారం జరిపిన చర్చలు సఫలమయ్యాయని జీఎంపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాయ మల్లేష్. సాదం రమేష్ తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు, నాగారం ఉపసర్పంచ్ రాజకీయ పలుకుబడితో అనూష ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లీజుకిచ్చాడని, వారు నిబంధనలను ఉల్లంఘిస్తూ మల్లన్నగుడిని కూల్చివేత పనిలో పడ్డార న్నారు. గుడ పునర్ నిర్మాణం చేయాలని క్రషర్ యాజ మాన్యం పై చర్యలు తీసుకోవాలని కోరగా స్పందించిన సదరు యాజమాన్యం రూ. 20 లక్షలతో గుడి నిర్మాణం చేసేందుకు ఒప్పొంద పత్రం రాసి ఇచ్చినట్టు తెలిపారు. మండల గొల్ల కురుమ ప్రజాప్రతినిధులు, సర్పంచ్., గొల్లకురుమ నాయకులు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసీనందుకు కృతజ్ఞతలు తెలిపారు. కురుమ సంఘం మండల అధ్యక్షుడు కెమిడి సాయిమల్లు, జీఎంపీఎస్ మండల అధ్యక్షులు గొరిగే అనిల్, యాదవ సంఘం మండల అధ్యక్షుడు సంగి రాజు. సర్పంచ్ సాదం విజరు మనోహర్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి గోరిగే మదర్ మోటో వీరస్వామి, జీఎంపీఎస్ నాయకులు కర్రె క్రిష్ణ, కొమురయ్య పీఏసీఎస్ చైర్మన్ మల్గా శ్రీశైలం, శేఖర్, శ్రీనివాస్, సిరిపురం ఎంపీటీసీ మాధవి కుమార్ చంద్రమౌళి, నెల్లుట్ల కురుమ సంఘం అధ్యక్షులు సిద్దయ్య శీను, కుమార్ యాదవ్ పాల్గొన్నారు.