Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథక కూలీలను నిర్లక్ష్యం చేస్తున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారధి విమర్శించారు. మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో కట్టెబోయిన శ్రీనివాస్, బానోత్ మాలీ అధ్యక్షతన గురువారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వ్యవ సాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) రెండో జిల్లా మహా సభకు ముఖ్యఅతిథిగా విజయసారథి పాల్గొని మాట్లాడారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తున్న ఉపాధి కూలీలను విస్మరించడం సరికాదన్నారు. దున్నేవాడికే భూమి కావాలన్న డిమాండ్‌తో పోరాడిన ఫలితంగా సంస్క రణలు వచ్చినా కూలీలకు ప్రయోజనం దక్కలేదన్నారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నియమించిన కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులు, కనీస వేతన చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు నిత్యావసరాల సరుకులు అందించడంలో పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు. అనంతరం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కట్టెబోయిన శ్రీనివాస్, చింతకుంట్ల వెంకన్నలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహాసభలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్‌రెడ్డి, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల వెంకన్న, సీపీఐ మండల కార్యదర్శి సారిక శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాండురంగాచారి, పెరుగు కుమార్, వరిపెల్లి వెంకన్న, పోగుల శ్రీనివాస్, మామిండ్ల సాంబలక్ష్మి, నాయకులు పుసు లూరి రంగన్న, రేషపల్లి నవీన్, తదితరులు పాల్గొన్నారు.