Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడి టీఆర్ఎస్ను ఓడించాలని పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం సూరారం గ్రామంలో బీజీఏపీ మండల ప్రధాన కార్యదర్శి దూరం మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది డాక్టర్ వివేక్ సమక్షంలో చేరారు అనంతరం ఏర్పాటుచేసిన సభలో వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. 20 సంవత్సరాలుగా మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పాలించినా ఈ ప్రాంతానికి ఏం చేయలేదన్నారు. కాలేశ్వరం బ్యాక్ వాటర్ తో సుమారు 30వేల ఎకరాలు ముంపున కు గురవుతున్నాయన్నారు. బీజేపీకి ఓటు వేసి చందుపట్ల సునీల్ రెడ్డి గెలిపించాలని కోరారు దూరం మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు దుర్గం తిరుపతి, మండల అధ్యక్షులు శ్రీమన్నారాయణ మండల నాయకులు సల్ల జగన్ రెడ్డి, బొల్లం కిషన్, కార్యకర్తలు పాల్గొన్నారు.