Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏరియా జనరల్ మేనేజర్
తుమ్మలపల్లి శ్రీనివాసరావు
నవతెలంగాణ-కోల్బెల్ట్:
భూపాలపల్లి ఏరియాలో సెప్టెంబర్ మాసపు బొగ్గు ఉత్పత్తి 59శాతమని ఏరియా జనరల్ మేనేజర్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ఉత్పత్తి ,ఉత్పాదకత అంశాలపై శుక్రవారం భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని జీఎం కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ నెల టార్గెట్ 2.85 లక్షల టన్నులు కాగా 1.59 లక్షల టన్నులతో 59 శాతం ఉత్పత్తి సాధించిందన్నారు. రవాణా 2.85 లక్షల టన్నులు కాగా 1.61 లక్షల టన్నుల తో 61శాతం సాధించిందని తెలిపారు. కేటీకే వన్ 35,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా 23,691 టన్నులు తో 68శాతం, కే టికే ఫైవ్ 35,000 టన్నుల లక్ష్యం కాగా 22,254 టన్నులతో 64 శాతం, కేటికే సిక్స్ 20 వేల టన్నుల లక్ష్యం కాగా 13,566 టన్నుల తో 68శాతం, కే టికె8 35,000 టన్నుల లక్ష్యం కాగా 17,721 టన్నుల తో 51శాతం మొత్తంగా అండర్ గ్రౌండ్ ల ఉత్పత్తి లక్ష్యం 1,25,000 ల టన్నులు కాగా 77,232 టన్నుల తో 62 శాతం ఉత్పత్తి సాధించిందని తెలిపారు. కేటీకే ఓసి టు ఉత్పత్తి లక్ష్యం 80,000 ల టన్నులు కాగా 69,203 టన్నుల తో 87శాతం, కేటీకే ఓసి త్రీ 80 వేల టన్నులు కాగా 12,593 టన్నులతో 16 శాతం ఉత్పత్తి సాధించిందని తెలిపారు. అక్టోబర్ మాస ఏరియా ఉత్పత్తి లక్ష్యం 3.35 లక్షల టన్నులు, రవాణా లక్ష్యం 3.55 లక్షల టన్నులని ఏరియా ఉత్పత్తిలో బాగా వెనుకబడిందని అన్నారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉద్యోగులంతా సమిష్టి కృషి చేయాలని అన్నారు. ఎస్డిఎల్ యంత్రాల పనిగంటలు పెంచడానికి కృషి చేయాలని, గైర్హాజర్ శాతాన్ని తగ్గించి ఉత్పత్తి పెంచే విధంగా కార్మికులకు అవగాహన కల్పించాలని అధికారులు కోరారు. రక్షణ విషయంలో విషయంలో రాజీ పడేది లేదని అన్నారు. కేటీకే ఓసి-3 ప్రభావిత గ్రామాలను వెంకటేశ్వర్లపల్లి ,ధర్మారావుపేట లలో వృత్తి విద్యా కోర్సుల మోటర్ డ్రైవింగ్ శిక్షణ, టైలరింగ్ వంటి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కారుణ్య నియామకాలు త్వరితగతిన చేపడుతున్నట్లు అధికార ప్రతినిధి అజ్మీర తుకారాం తెలిపారు. ఈ సమావేశంలో ఏజిఎం(ఐ ఈడి) ఎస్ జ్యోతి, ఏవో మౌనిక, తదితరులు పాల్గొన్నారు.