Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడకండ్ల
డీసీసీ బ్యాంక్ లోన్ ద్వారా మంజూరైన గొర్రెలను శుక్రవారం డీసీసీ బ్యాంక్ వైస్ చైర్మెన్ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం డీసీసీ బ్యాంక్ ద్వారా మంజూరు చేసిన గొర్రెలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని, ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెందరెడ్డి, డైరెక్టర్ సతీష్, డీసీసీి బ్యాంక్ మేనేజర్ కళ్యాణి, ఫీల్డ్ ఆఫీసర్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.