Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ గిరిజన సంఘం
జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ చౌహాన్
నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి నియోజకవర్గ గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ చౌహాన్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని వివిధ కళాశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకుని ఆయన మాట్లాడారు. తండా నుండి విద్యార్థులు కాలేజీలకు రావాలంటే బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేక ప్రైవేట్ కళాశాలకు పంపించి వేలకు వేలు ఫీజులు కడుతూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గిరిజన తండాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. మండల నాయకులు విక్కి నాయక్, సుమన్ నాయక్, గణేష్ నాయక్, వెంకన్న, మౌనిక, సుప్రియ, ఉమా, తదితరులు పాల్గొన్నారు.