Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
కాళేశ్వరం రైతులకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఎకరాకు రూ.30 లక్షలు నష్టపరిహారమివ్వాలని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేసారు. శుక్రవారం మండలం లోని కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు బాదితులను చంద్రుపట్ల సునీల్ రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం ముంపునకు గురైన పంటలను పరిశీలించి మాట్లాడుతూ... ఇప్పటికే మూడుసార్లు పంటచేలు ముని గాయని, అటు కౌలు డబ్బులతో పాటు పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయామని కౌలు రైతులు విన్నవించారన్నారు. ప్రాజెక్టు కట్టేప్పుడే ముంపుకు గురవుతున్న పొలాలు చేనులను ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో ప్రభుత్వం తీసుకో వాలన్నారు. రైతులను ఢల్లీీ తీసుకెల్లి కేంద్ర మంత్రులకు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సమస్య పై మాట్లా డతామని హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్ వైఫల్యంతోనే పంటచేలు ముంపునకు గురవుతున్నాయని అన్నారు. రీ డిజైన్ పేరుతో భారీగా కుంభకోణం జరిగిందని, ప్రాజెక్టు ఖర్చు రూ.36వేల కోట్ల నుండి లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. బీజేపీ మంథని నియోజక వర్గ ఇంచార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. లేదంటే ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.