Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీపీ రాణిబాయి రామారావు
నవతెలంగాణ-మహాదేవపూర్
సుదీర్ఘ కాలం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుల మతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, స్వరాష్ట్రంలోమ హిందువులకు బతుకమ్మ చీరెలు, ముస్లింలకు రంజాన్ కానుకలు, క్రిస్టియన్ లకు క్రిస్మస్ కానుకలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఎంపీపీ బి.రాణిబారు రామారావు అన్నారు. శుక్రవారం ఆమె మండలంలో విలేకర్లతో మాట్లా డారు. మండలానికి 11690 చీరెలు వచ్చాయని, గాంధీ జయంతి సందర్భంగా అడబిడ్డలకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. గతంలో మాదిరి కాకుండా ఈ సారి 17 రంగుల్లో, 17 డిజైన్లలో బతుకమ్మ చీరెలు వచ్చాయని పేర్కొన్నారు. మండలంలోని 18 ఏండ్ల వయస్సు ఉన్న ప్రతి ఆడబిడ్డకు రేషన్ డీలర్ల ద్వారా బతుకమ్మ చీరెలు పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు.
నర్మెట్ట : మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం నుంచి ఆయా గ్రామాలకు శుక్రవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఆయా గ్రామాలకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో గ్రామపంచాయతీ సిబ్బంది ట్రాక్టర్లో బతుకమ్మ చీరలు ఆయా గ్రామాలకు తరలిస్తున్నారు.