Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
భూపాలపల్లి నియోజకవర్గాన్ని అబివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి బురద జల్లడం సరైంది కాదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొలుసాని లక్ష్మీనరసింహారావు విమర్శించారు. శుక్రవారం టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గుర్రం తిరుపతి అధ్యక్షతన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూపాలపల్లిలో జరిగిన మీటింగ్ లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై చేసిన ఆరోపణల్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో జైలు శిక్ష అనుభవించిన రేవంత్‌రెడ్డి మచ్చలేని గండ్ర వెంకటరమణ రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. కాంగ్రెస్ కండువా సత్యనారాయణరావుకు కప్పిన రేవంత్‌రెడ్డి భూపాలపల్లి నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, పూలమాల కూడా వేయ లేదన్నారు. అలాంటి వారికి దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తమ నాయకుడు పార్టీ మారారు తప్ప, పదవుల కోసం మారలేదన్నారు. పీఏసీఎస్ చైర్మెన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, సర్పంచ్‌లు నారగని దేవేందర్ గౌడ్, ఐలోని శశిరేఖ రాంచంద్రారెడ్డి, మంజుల భాస్కర్ రావు, మానస శ్రీనివాస్, రామంచ భద్రయ్య, ఎంపీటీసీలు శివశంకర్‌గౌడ్, సుదర్మ మలహాలరావు, రమాదేవి మధుకర్, అశోక్ రెడ్డి, సరస్వతి శ్రీనివాస్, ఉప సర్పంచ్ అశోక్, యాదవ గ్రామశాఖ అధ్యక్షులు కృష్ణ, సీనియర్ నాయకులు జనార్దన్, గంగాధర్‌రావు పాల్గొన్నారు.
పూటకో పార్టీ మారే నైజం సత్యనారాయణది
టేకుమట్ల : పూటకో పార్టీ మారే నైజం గండ్ర సత్యనారాయణ రావుదని టీఆర్ఎస్ మండల నాయకులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు సట్ల రవిగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి పాల్గొని మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పార్టీ మారాడు తప్ప తన స్వలా భానికి కాదని గుర్తు చేశారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు గండ్ర సత్యనారాయణరావు పార్టీలు మారడం భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారన్నారు. అవకాశవాది సత్యనారాయణ రావు అని, పేదవాడినని చెప్పుకునే గండ్ర సత్యనారాయణరావుకు 3 సార్లు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. అభివృద్ధి చేసిన వారిని నియోజకవర్గ ప్రజలు మర్చిపోరని వారికే పట్టం కడతారన్నారు. ఎమ్మెల్యే గండ్ర పై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, రాబోయే ఎన్నికల్లో భూపాలపల్లి గడ్డ పై టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైస్ ఎంపీపీ ఐలయ్య టిఆర్ఎస్ పార్టీ మండల నాయ కులు అధ్యక్షుడు కత్తి సంపత్, ఆకునూరు తిరుపతి, సర్పంచులు కులాల సర్వోత్తమ్ రెడ్డి పండుగ శ్రీనివాస్ ఉద్దమర్రి మహేష్, గునిగంటి మహేందర్, ఉమెందారరావు, తదితరులు పాల్గొన్నారు.