Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంగన్వాడీ సెంటర్‌ను అధికారుల పరిశీలన
నవతెలంగాణ-తొర్రూరు
తొర్రూరు మున్సిపాలిటీ లోని అంబేద్కర్ నగర్ లో ఉన్న అంగన్వాడీ సెంటర్ 1 లోని ఆయా జి శోభకు శుక్రవారం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అధి కారులు, ప్రజాప్రతినిధులు హుటాహుటిన అంగన్వాడీ సెంటర్‌ను సందర్శించారు. అంగన్వాడీ సెంటర్ పరిధి ప్రాథమిక పాఠశాల విద్యార్థులను కూడా ఇంటికి పంపించారు. వారం రోజులపాటు కరోనా వ్యాక్సిన్ సెంటరు ఒకవైపు, పాఠశాల విద్యార్థులు, మరోపక్క అంగన్వాడీ సెంటర కు వచ్చే బాలింతలు, చిన్న పిల్లలతో పాటు 18 సంవత్సరాలు పైబడిన వారందరూ వాక్సినేషన్ సెంటర్‌కు రాకపోకలు సాగించడంతో ఆయమ్మకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు అంగన్వాడీ సెంటర్‌కు చేరుకుని విద్యార్థు లను ఇంటికి పంపించారు. అంగన్వాడీ టీచర్ లలిత ప్రధాన ఉపాధ్యాయురాలు రాజ సుకన్యను విద్యార్థుల వివరాలు, వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయమ్మకు కాంటాక్ట్‌లో ఉన్న వారందరినీ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ రాపిడ్ టెస్టుల కోసం 15 మందిని పంపించగా అందరికీ నెగిటివ్ వచ్చింది. మిగతా వారందరికీ కూడా త్వరలోనే టెస్టులు చేయించు తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు డిప్యూటీ డీఎంహెచ్ఓ గుండాల మురళీధర్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.