Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లక్ష్యమని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బుర్ర రమేష్‌గౌడ్, అర్బన్ అధ్యక్షులు కటకం జనార్ధన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారాడని ఆరోపించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కార్యకర్తల అభిప్రాయం మేరకే టీఆర్ఎస్లో చేరినట్టు గుర్తు చేశారు. గండ్ర సత్యనారాయణరావు స్వార్థం కోసం పార్టీలు మారాడని విమర్శించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి ఇసుక మాఫియా , ల్యాండ్ మాఫియా పెట్రోల్ మాఫియా లాంటివి లేవని అన్నారు. నిజం తెలుసుకొని మాట్లాడాలని హితవుపలికారు. రైతు భరోసా యాత్ర రైతులకు గిట్టబాటు అమరణ నిరాహార దీక్ష చేసిన ఘనత గండ్ర వెంకటరమణారెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్‌్ సెగ్గం వెంకట రాణి సిద్దు, వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్, ఆలయ కమిటీ చైర్మెన్ గడ్డం కుమార్‌రెడ్డి, సాగర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్స్, యూత్ అద్యక్షులు బుర్ర రాజు గౌడ్,కరిమ్మ్, గండ్ర యువసేన నాయకులు, శ్రీకాంత్ పటేల్, రఘు రెడ్డి, ముత్తు, రాకేష్ పాల్గొన్నారు.