Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
బదిలీపై వెళ్తున్న ఏసీపీ వినోద్‌కుమార్ మూడు సంవత్సరాలుగా జనగామ జిల్లాలో చేసిన సేవలు అభినందనీయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకారెడ్డి అన్నారు. జనగామ ఏసీపీ గా సమర్థవంతంగా విధులు నిర్వహించి బదిలీపై హైదరాబాద్‌కు వెళ్తున్న వినోద్‌కుమార్‌ను సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఏసీబీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి కనకా రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అనేక పోరాటాలు ఉద్యమాల ఫలితంగా జనగామ జిల్లా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. జిల్లా కేంద్రానికి ఏసీపీగా వినోద్ కుమార్ జిల్లా ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశాడని అన్నారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల వారికి సముచిత గౌరవం ఇచ్చారన్నారు. వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, కమిటీ సభ్యులు బూడిద గోపి బోట్ల శేఖర్, పట్టణ కమిటీ సభ్యులు జోగు ప్రకాష్ , ఎండీ ిఅజారుద్దీన్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దూసరి నాగరాజు, నాయకులు పోత్కనూరి కనకాచారి, విప్లవ రెడ్డి పాల్గొన్నారు.