Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గండ్ర సత్యనారాయణరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గండ్ర సత్యనారాయణరావు కోరారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గురువారం రాత్రి భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభకు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారని, ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా నిర్వహించిన సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభకు సహకారమందించిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకులకు మీడియా మిత్రులకు అధికార పార్టీ ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినా సభకు హాజరై విజయవంతం చేసిన అభిమానులుకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాగే కలిసికట్టుగా పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో అర్బన్ అధ్యక్షులు దేవన్, కాంగ్రెస్ నాయకులు బుర్ర కోమరయ్య,ఆకుల మహేందర్, అంబాల శ్రీను, తోట సంతోష్, కౌన్సిలర్ దాట్ల శ్రీను, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు కరుణాకర్, యూత్ నాయకులు రాజేందర్, తోట రంజిత్, బెంబడి సురేష్హఫిజ్, మహేందర్, రజనీకాంత్,అహ్మద్,రాజేష్, రంజిత్,రాకేష్ పాల్గొన్నారు.