Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జెడ్పీ స్టాన్డింగ్ చైర్మెన్ రవి
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
కరోనా నివారణకు కోవిడ్ టీకా రక్షిస్తోందని జెడ్పీ స్టాన్డింగ్ కమిటీ చైర్మెన్ మారపాక రవి అన్నారు. శువ్రకారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శతశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న సంధర్భంగా సర్పంచ్ గోవింద్ ఆనందం అధ్యక్షతన కేక్ కట్ చేశారు. ఇందుకు శ్రమించిన ఆశాకార్యకర్తలను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని హర్షంవ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజయ్య జనవరి లో వ్యాక్సిన్ వేసుకొని ప్రజలందరికీ స్పూర్తిగా నిలిచారని అన్నారు. ఇదే తీరులో వారం రోజులుగా గ్రామాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి టీకా వేస్తున్నారని తెలిపారు. పలు గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ టీకా వేసుకోని వారిని గుర్తించి అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా కృషి చేస్తున్నారని అన్నారు. వృద్ధులు, వికలాంగులు, కొవిడ్ సెంటర్‌కు వెళ్లలేని వారిని ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు గుర్తించి టీకా కేంద్రాలకు తరలించాలని తెలిపారు. అనంతరం గ్రామంలో చింతకింది యాదగిరి (50) అనారోగ్యంతో మరణించగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కుమారస్వామి, ఎంపిటిసి బెల్లపు వెంకటస్వామి, ఉప సర్పంచ్ మహేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ రెడ్డి, డా. విజరు కిరణ్, సీహెచ్ఓ కిషన్ రావు, పంచాయతీ కార్యదర్శి వేణు, జోగు లింగస్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.