Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-భూపాలపల్లి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు పూర్తి వివరాలు శాఖల వారీగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జయశంకర్-భూపాలపల్లి, ములుగు జిల్లాల వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, సహకారశాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు సకాలంలో లబ్ధిదా రులకు లబ్ధి చేకూర్చేలా అమల్జేయాలన్నారు. కార్యాల యాల్లో ఫ్లెక్సీల రూపంలో పథకాల వివరాలు అందు బాటులో ఉంచాలన్నారు. అధిక వర్షాలతో నష్టపోయిన పంటల వివరాల నివేదిక అందించాలన్నారు. పంటనష్టం, ముంపు భూముల వివరాల సేకరణను పర్యవేక్షించాలని ఆర్డీవో శ్రీనివాస్‌ను ఆదేశించారు. వర్షాకాలంలో పశువైద్య అధికారులు,సిబ్బంది అందుబాటులో ఉండి పశువైద్య సేవలందించాలని, అవసరమైన సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవాలని ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో హెచ్ఆర్ ఫైళ్లను సమర్థవంతంగా నిర్వహించి రెగ్యులర్ ఎంప్లార్సు తో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు ఒకేసారి అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి శాఖలోని ఉద్యోగుల వివరాలు అందించాల న్నారు. మూడునెలలుగా నెలకు 22 రోజులకు తక్కువగా అటెండెన్స్ యాప్‌లో హాజరు నమోదు చేసుకున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. ఈ-ఆఫీస్ ద్వారా అన్ని వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. ఆయా శాఖలకు సంబంధించిన శాశ్వత భవనాలు, పరికరాలు, ఫర్నిచర్ ఆస్తుల వివరాలను తెలియజేయాలన్నారు. అనంతరం భూపాలపల్లి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారు లతో సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ లాంటివి ప్రబలే అవకాశం ఉన్నదని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రి వేస్టేజ్‌ని వేసేందుకు అన్ని ఆసుపత్రుల ఆవరణలో గుంతలు తవ్వాలన్నారు. ఆన్లైన్ ఇ-అటెండెన్స్ ఆప్ లో ఈరోజు దాదాపు వంద మందికి పైగా వైద్య సిబ్బంది గైర్హాజరుగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. ఇ-అటెండెన్స్ ఆప్ లో వందశాతం హాజరు నమోదు చేసుకోవాలన్నారు. లేదంటే చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. వైద్యఆరోగ్యశాఖ ఆస్తుల వివరాలను డిఎంహెచ్ ఓ కార్యాలయం, సీహెచ్‌సీలు, పీిహెచ్సీ, సబ్ సెంటర్ల వారీగా నమోదు చేయాలన్నారు.
చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
పండుగ వాతావరణంలో బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యా లయంలో గ్రామీణఅభివృద్ధిశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని భూపాలపల్లి మున్సి పాలిటీ పరిధి 11 మండలాల్లో 277 రేషన్ షాపుల ద్వారా 18-60ఏండ్ల లోపు మహిళలకు 1లక్ష43వేల800 బతకమ్మ చీరలు, 61 ఏండ్లు పైబడిన మహిళలకు ప్రత్యేకంగా రూపొందించిన 23 వేల చీరలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామన్నారు. రూ.4కోట్ల63లక్షల 98వేల870తో 30 డిజైన్లలో రూపొందించిన బతుకమ్మ చీరలను ఉచితంగా అందజేస్తారని తెలిపారు. నేటి నుంచి వారం రోజుల పాటు చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. నేడు భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ షెగ్గెం వెంకటరాణి, పాలకులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు.
అయా కార్యక్రమాల్లో అన్నారం బ్యారేజ్ ఈఈ యాదగిరి, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు విజరు భాస్కర్, గౌస్ హైదర్, జిల్లా పశుసంవర్ధక అధికారులు కుమారస్వామి, విజరు భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారులు జర్పుల భాస్కర్, వీరన్న, జిల్లా సహకార అధికారులు మద్దిలేటి, సర్దార్ సింగ్ మాలోతు, కలెక్టర్ కార్యాలయ ఏవో మహేష్ బాబు, డీఎంహెచ్ఓ శ్రీరామ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య, అదనపు కలెక్టర్ దివాకర్, జిల్లా గ్రామీణఅభివద్ధి అధికారి పురుషోత్తం, జెడ్పీ సీఈఓ శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.
కొత్త పాస్ బుక్కులు ఇవ్వాలి
మహాదేవపూర్ : పాత పాసుబుక్కులు స్థానంలో కొత్త పాసు బుక్కు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు శుక్రవారం తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు చల్లా చంద్రయ్య, టీఆర్ఎస్ జిల్లా యువ నాయకులు జక్కు రాకేశ్ ఆధ్వర్యంలో రైతులు వినతిపత్రం అందజేశారు. సూరారం రాపల్లికోట, అనకాపల్లి, కృష్ణరావుపేట, బెగ్లూర్, మహాదేవపూర్ ఇతర గ్రామాల్లో కొన్నేండ్లుగా సాగు చేసుకుంటూ పట్టాదారు పాసు బుక్కులు ఉన్నవాటికి ధరణిలో ఆన్లైన్ లేకపోవడంతో కొత్త పాస్ బుక్కులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భూ సర్వే నిర్వహించి ధరణిలో ఆన్లైన్ నమోదు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. సూరారం మాజీ సర్పంచ్ సల్ల రాజిరెడ్డి, ఉపసర్పంచ్ రమేష్‌రెడ్డి, కాళేశ్వరం దేవస్థానం మాజీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గన్నారు.