Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకుమట్ల
మహిళలు బతుకమ్మ పండుగను వేడుకగా జరుపుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆకాంక్షించారు. మండలంలోని రామకష్ణాపూర్ (టి) గ్రామంలోని ఎమ్మార్సీ భవన్లో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి అధ్యక్షతన మహిళలకు బతుకమ్మ చీరలు, లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో అమలౌతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. పేద కుటుంబాలను ఆదుకునేలా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్కు ఉన్న ప్రజాదరణను ఓర్వలేక ప్రతాపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న నాయకులు నియోజకవర్గ ప్రజల చేతిలో మూల్యం చెల్లించక తప్పదన్నారు. అనంతరం మండలంలోని అంకుషాపూర్, సోమనపల్లి, వెల్లంపల్లి, వెంకట్రావుపల్లి గ్రామాల్లో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ ఐలయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి, సర్పంచ్లు పండుగ శ్రీనివాస్, ఉద్దెమారి మహేష్, గునిగంటి మహేందర్, బిల్లకంటి ఉమేందర్రావు, చదువు మధిర, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయబ్ తహసీల్దార్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.