Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం
రానున్న రోజుల్లో టీఆర్ఎస్కు గుణపాఠం తప్పదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు అన్నారు. మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడారు. నిరుద్యోగ విద్యార్థి సైరన్ కార్యక్రమాన్ని పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం అణచివేయడం దుర్మార్గమన్నారు. విద్యార్థులను, యువతను మోసం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వసంత శ్రీనివాస్ యాదవ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల నవీన్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చేల వినరుకుమార్, యూత్ కార్యదర్శి సర్దార్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.