Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- దేవరుప్పుల
పశుసంపదతో రైతులకు లాభాలు చేకూరుతాయని పరమేశ్వర గోశాల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ అన్నారు.ఆదివారం పడమటి తండా పంచాయతీ పరిధిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 10మంది రైతులకు 20లేగదూడలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పశుసంపద రైతుకు ఆయువుపట్టు అని అన్నారు. పశువుల సంరక్షణ ద్వారా వివిధ లాభాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోశాల బ్రాండ్ అంబాసిడర్ లావణ్య శోభ, ముఖేష్ శుక్ల, స్థానిక గోశాల కార్యదర్శి లకావత్ అశోక్, సర్పంచ్ కోక్యనాయక్, ఉప సర్పంచ్ భోజనాయక్ తదితరులు పాల్గొన్నారు.