Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - స్టేషన్ ఘన్ పూర్
'మహిళలంటే అపార గౌరవమని, వారిని అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రోత్సహిస్తూ నిత్యం పొగుడుతానే తప్ప అగౌరవ పరచను' అని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శనివారం లింగాల ఘన్పూర్లో జరిగిన చీరల పంపణీ కార్యక్రమంలో మాట్లాడే క్రమంలో తన మాటలను ఓ పత్రిక వక్రీకరిస్తూ రాయడం బాధకరమన్నారు. తాను తప్పుగా మాట్లాడలేదని, తప్పిదమనుకుంటే తనను క్షమించాలని సభాముఖంగా కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.