Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథ్‌పల్లి
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏదునూరి వెంకట్రాజం అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో కడారి ఐలయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుదన్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. వెంటనే ధరలను తగ్గించాలని లేకుంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పొదల నాగరాజు, మండల కార్యదర్శి గంగపురం మహేందర్, సభ్యులు కాసాని పుల్లయ్య పొదల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు