Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
బహత్ పల్లె ప్రకృతి వనాలను పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శశాంక చెప్పారు. మండలంలోని జమిస్తాన్పురంలో నిర్మిస్తున్న పల్లె ప్రకృతి వనాన్ని, సోమారంలోని వైకుంఠధామాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీని కలెక్టర్ ఆదివారం సందర్శించి పరిశీలించారు. పదెకరాల విస్తీర్ణంలో చేపట్టిన బహత్ పల్లె ప్రకృతి వనానికి బౌండరీలు ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు నాటాలని సూచించారు. ఈనెల చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. సోమారంలోని పల్లె ప్రకతి వనంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు. స్మశాన వాటికలో మిగితా పనులను పూర్తి చేసి సోలార్ లాంప్ అమర్చా లని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాలను, వైకుంఠధామాలను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఆయన వెంట సీఈఓ రమాదేవి, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, డీపీఓ రఘువరన్, ఆర్డీఓ రమేష్, పీఏసీఎస్ చైర్మెన్ కాకిరాల హరిప్రసాద్, తహసీల్దార్ రాఘవరెడ్డి, సర్పంచ్లు రవీందర్రెడ్డి, సంపత్, పంచాయతీ కార్యదర్శులు ముక్తీశ్వర్, పుల్లురి కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.