Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నడికూడ
సెల్ఫీ మోజులో వాగులో పడి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం గుడే ప్పాడుకు చెందిన చిమ్మని వివేక్ (27) హనుమకొండలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన మిత్రులతో కంటత్మకూర్ గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి వాగులో పడి మతిచెందాడు. స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. దామెర ఎస్సై శ్రీలత, ఏఎస్ఐ చారి, పీసీ కిషోర్లు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలుపుతానని పోలీసులు తెలిపారు.