Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
సహకారోద్యమకారుడు, న్యాయవాది అర్శనపెల్లి వెంకటేశ్వరావు అందించిన స్ఫూర్తిని కొనసాగించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ముగ్ధుంపురంలో నిర్వహించిన ఏవీఆర్ 12వ వర్థంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయవాదిగా పేదల పక్షాణ నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఏవీఆర్ జూనియర్ న్యాయవాదుల కోసం ఏఎస్వీఆర్ లా లైబ్రరీ ఏర్పాటు చేసి వారి ఉన్నతీకి మార్గం చూపారన్నారు. సహకార గ్రామీణ పరపతి పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి ఐక్యతను నెలకొల్పారన్నారు. ఆయన కనపర్చిన స్ఫూర్తితో నేటి వరకు సహకార పరపతి సంఘాలు ఆర్థిక పరిపుష్టతను సాధించి దిగ్విజయంగా కొనసాగడం అభినందనీయమన్నారు. ఏవీఆర్ అందించిన సేవలు చిరస్మనీయమని కొనియాడారు. సభకు ముందు ఏవీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యేతో పాటు పలువురు నివాళ్లర్పించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సహౌదరెడ్డి, జైపాల్ రెడ్డి, భానోతు సంగులాల్, వెంకటేశ్వరావు, సాంబరెడ్డి, పొదుపు సంఘాల బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-చెన్నారావుపేట
అర్చనపెల్లి వెంకటేశ్వర్రావు(ఏవీఆర్) వర్థంతిని ఆదివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకన్న, సర్పంచ్ మల్లయ్య, వైస్ ఎంపీపీ కంది కష్ణారెడ్డి, జెడ్పీటీసీ పత్తి నాయక్, సీఈఓ రవి పాల్గొన్నారు.