Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాయపర్తి
తెలంగాణ సంస్కృతికీ బతుకమ్మ ప్రతిబింబమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్థానిక ఎంపీపీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రికి మహిళలు కోలాటం, ఆటపాటలతో, బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జిల్లా కలెక్టర్ గోపితో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమన్నారు. ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. రైతాంగ అభివద్ధికి కేసీఆర్ చేపడుతున్న కషి మరువలేనిదన్నారు. మహిళలు కుటీర పరిశ్రమల కోసం శ్రీ నిధిని కూడా ఉపయోగించుకోవాలని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరి సింగ్, డీఆర్డీఏ పీడీ సంపత్ రావు, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ కిషన్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్, గ్రామ సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీలు రాధిక సుభాష్ రెడ్డి, అయిత రాంచందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-వేలేరు
స్థానిక పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కాయిత మాధవరెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే టీ రాజయ్య మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం రూ.లు 60వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితుడు బిల్లా వెంకటేశ్వర్లకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కేసీ రెడ్డి సమ్మిరెడ్డి, జెడ్పీటీసీ చాడ సరిత, ఆత్మా డైరెక్టర్ కీర్తీ వెంకటేశ్వర్లు, కుడా అడ్వైజరీ డైరెక్టర్ బిల్లా యాదగిరి, వైస్ ఎంపీపీ సంపత్, ఏఎంసీి వైస్ చైర్మన్ కరమ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ -పర్వతగిరి
ఇస్లావత్ తండాలో సర్పంచ్ ఇస్లావత్ రమేష్ నాయక్ మహిళలకు ఆదివారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్, అంగన్వాడీ టీచర్లు సుగుణ, బద్రి, ఆయాలు సావిత్రి, సునీత, వార్డు సభ్యులు బాలు తదితరులు పాల్గొన్నారు.
నవ తెలంగాణ-ధర్మసాగర్
ఆదివారం స్థానిక రైతువేదికలో ఎంపీడీఓ జోహార్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రబెల్లి శరత్, జెడ్పీటీసీ పిట్టల శ్రీలత కాలేరు కరన్ చంద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు మునిగేల రాజు, ఎంపీటీసీలు వనమాల, శోభ సోమయ్య, ఉప సర్పంచ్ బొడ్డు అరుణ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.