Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
అక్రమ అరెస్టులతో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆపలేరని కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు పెండెం రామానంద్, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్యలు అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంత్‌చారి విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్టు చేయడం అమానుషమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు భానోతు లక్ష్మణ్, శ్రీనివాస్, మాధవరెడ్డి, పాలాయి రవి, ఒర్సు తిరుపతి, ముగ్ధంపురం ఎంపీటీసీ చీకటి స్వరూప ఓదయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్తావత్ పద్మబాయి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-పర్వతగిరి.
టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్ పిలుపునిచ్చారు. విద్యార్థి జంగ్ సైరన్‌కు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ డైరెక్టర్ పిన్నింటి సునీల్ రావు, సేవాదళ్ అధ్యక్షుడు మోహన్ రావు, పట్టణాధ్యక్షుడు దారం పూర్ణచందర్, యూత్ నాయకులు కందికట్ల అనిల్ పాల్గొన్నారు.
నవ తెలంగాణ-నల్లబెల్లి
నిరుద్యోగ జంగ్ సైరన్‌ను శాంతియుతంగా నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులపై లాఠీచార్జి, అరెస్టులను నిరసిస్తూ ఆదివారం స్థానిక బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోతు చరణ్ సింగ్, అశోక్, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చర్ల శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-చెన్నారావుపేట
మండల కేంద్రంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్, సర్పంచ్ సిద్దేన రమేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు రూపిక శ్రావణ్ కుమార్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బండి హరీష్ తదితరులు పాల్గొన్నారు.
ెనవతెలంగాణ-రఘునాథ్‌పల్లి
స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కేసీఆర్, కేటీఆర్‌ల దిష్టిబొమ్మలను ఆదివారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల వరలక్ష్మి నరేందర్, జిల్లా నాయకులు గాదె మహేందర్ రెడ్డి, ఎంపీటీసీలు పేర్ని ఉషా రవికురుమ', అల్లిబిల్లి కష్ణ, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కావటి భాస్కర్ పాల్గొన్నారు
నవతెలంగాణ-మట్టెవాడ.
కాంగ్రెస్ నాయకులపై లాఠీచార్జికి నిరసనగా ఆదివారం స్టేషన్‌రోడ్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి సుధాకర్, తాటికొండ ప్రసాద్, నర్మెట్ట చిన్న, యాదగిరి, బోళ్ల వినరు, సంపత్ పాల్గొన్నారు.